గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (08:55 IST)

బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ ఇకలేరు

బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ (63) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన అవయవాల వైఫల్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు యశ్‌పాల్‌ శర్మ తెలిపారు. 
 
అనుపమ్‌ మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’తో పాటు పలు టీవీ సీరియల్స్‌తో పాటు స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌, బందిపోటు క్వీన్‌ తదితర చిత్రాల్లో నటించారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన సబర్బన్‌ గోరేగావ్‌లోని లైఫ్‌లైన్‌ ఆసుప్రతిలో చేరారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి కన్నుమూశారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు యశ్‌పాల్‌ శర్మ తెలిపారు.
 
కాగా, మూడు దశాబ్దాల సుదీర్ఘ నట జీవితంలో శ్యామ్‌ ‘సత్య, దిల్‌ సే, లగాన్‌, హజారోన్‌ ఖ్వైషేన్‌ ఐసీ’వంటి చిత్రాలతో నటించారు. ‘మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’ సీరియల్‌లో ఠాకూర్‌ సజ్జన్‌ సింగ్‌ పాత్ర పోషించిన ఆయన.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.