శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (09:07 IST)

సామాన్యులకు చమురు కంపెనీల ఊరట

దేశంలో చమురు ధరలు కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్, డీజిల్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 
 
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడు వారాలుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో శనివారం పెట్రోల్ ధర లీటరుకు రూ.105.83గా ఉంది. డీజిల్ ధర రూ.97.96 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.107.64 ఉండగా.. డీజిల్ రేటు లీటరుకు రూ.99.26 వద్ద కొనసాగుతోంది.