Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్
తన తొలి సినిమా 'సినిమా బండి' ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం 'పరదా'తో వస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత వంటి అద్భుతమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదల ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో, సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మా అందాల సిరి సాంగ్ ని రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. గోపీ సుందర్ ఈ సాంగ్ ని క్యాచి బీట్స్ తో బ్యూటీఫుల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. శ్రీ కృష్ణ, రమ్య బెహరా వోకల్స్ పాటకి మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. వనమాలి రాసిన మీనింగ్ ఫుల్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ట్రెడిషన్ ఒట్టిపడే ఈ సాంగ్ లో విజువల్స్ ప్లజెంట్ గా వున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ఎలిగెంట్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇన్స్టంట్ హిట్ గా నిలిచిన ఈ సాంగ్ ఆల్బమ్ కు చార్ట్ బస్టర్ స్టార్ట్ ని అందించింది.
ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ డీవోపీగా పని చేస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్. శ్రీనివాస్ కళింగ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.