శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2024 (15:17 IST)

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

Suresh Gopi, Anupama Parameswaran
Suresh Gopi, Anupama Parameswaran
సూపర్ స్టార్ సురేష్ గోపి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న యదార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్పధ కోణంలో తీసిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జె. ఎస్. కె). బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
అనుపమ పరమేశ్వరన్ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకి పై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు. ఈ కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి గారు నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.