బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 జులై 2024 (16:48 IST)

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చిత్రం ప్రారంభం

Bellamkonda Sai Srinivas, sahu garapti and others
Bellamkonda Sai Srinivas, sahu garapti and others
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చిత్రం నేడు   అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా  ప్రారంభం అయింది. 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్టర్ గా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా ప్రారంభమైయింది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8 గా  సాహు గారపాటి నిర్మిస్తూన్నారు. 
 
ఇటీవలే హీరో లుక్ విడుదల చేశారు. వరల్డ్, యూనిక్ ప్రిమైజ్ లో సెట్ చేయబడిన ఈ హారర్-మిస్టరీ మూవీ ఇప్పటికే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌తో సంచలనం సృష్టించింది. ఈ మూవీలో యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఎవర్ ఛార్మింగ్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ గ్రిప్పింగ్ నెరేటివ్ అందించబోతున్నారు. ఇద్దరు యాక్టర్స్ తమ కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ పోషించని పాత్రలతో సినిమాపై ఎక్సయిట్మెంట్ ని పెంచుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ జూలై 11న ప్రారంభమై శరవేగంగా సాగనుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
 
ఈ చిత్రానికి  సంగీతం - బి. అజనీష్ లోక్‌నాథ్, డీవోపీ - చిన్మయ్ సలాస్కర్, ఎడిటర్ - నిరంజన్ దేవరమానే, ఫైట్స్: జాషువా మాస్టర్,  సహ రచయిత - దరహాస్ పాలకొల్లు