సోమవారం, 31 మార్చి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 28 మార్చి 2025 (21:40 IST)

మనసే సుగంధం తలపే తీయందం

Love poem
ఫోటో కర్టెసీ- Freepik
మనసే సుగంధం
తలపే తీయందం
కౌగిలి వెచ్చదనం
ప్రేమ అపురూపం
 
నీ చేతిలో నా చేయి బాస
నీ కన్నుల్లో నా నీడ ఘోష
నీ గుండెల్లో నా శ్వాస స్పర్శ
నీ ఆనందం నా పొదరిల్లు పరామర్శ
 
సుకుమార నీ పాదాల పైన
సుతిమెత్తగా నా అరచేతుల లాలన
నా గుండె గదులకు నీ ఆత్మీయ పాలన
నీ అణువణువూ నా ప్రాణమై....
నీకోసమే నిత్యం నిరీక్షిస్తూ...