సంబంధిత వార్తలు
- విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్
- 29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు
- స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది జగనే.. పవన్ (video)
- భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లకు బిగిస్తే కఠిన చర్యలు : వైజాగ్ కమిషనర్
- శారదా పీఠానికి చెందిన 15 ఎకరాల భూమి స్వాధీనం
వారి ప్రేమకు పెద్దలు నో చెప్పారు.. అంతే భవనంపై నుంచి దూకేశారు..! (video)
విశాఖపట్నంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో విశాఖకు చెందిన ఈ ప్రేమ జంట.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత గాజువాకలోని ఓ ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలవారు అమలాపురం నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి షీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో దుర్గారావు, సుష్మిత మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు ఇద్దరు ఓ అపార్ట్‌మెంట్ పైనుండి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బిల్డింగ్ పై నుండి దూకి ప్రేమజంట ఆత్మహత్య
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2024
విశాఖపట్నం - గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెంలో అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత కుటుంబాలు బతుకుదెరువు కోసం వలస వచ్చి షీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాయి.
ఈ క్రమంలోనే… pic.twitter.com/8GLRZs4l3M
తర్వాతి కథనం
