ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 నవంబరు 2024 (17:35 IST)

భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లకు బిగిస్తే కఠిన చర్యలు : వైజాగ్ కమిషనర్

appolice
ద్విచక్రవాహనాలకు భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైజాగ్ పోలీస్ కమిషనర్ శంఖబ్రత హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సైలెన్సర్‌కు మాడిఫికేషన్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని, బైక్ యజమానితో పాటు మెకానిక్ పైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందువల్ల భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించుకోవద్దని ఆయన వాహనదారులకు సూచించారు. 
 
సైలెన్సర్ మాడిఫికేషన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ మొత్తంలో ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బైక్‌లకు అమర్చిన భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం సమీపంలో సుమారు 80 సైలెన్సర్లను రోడ్ రోలర్‌‍తో తొక్కించి ధ్వంసం చేశారు.
 
బైక్ సైలెన్సర్లలో మార్పులు చేర్పులు చేసి భారీ శబ్దం వచ్చేలా చేయడం సరికాదని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. దీనివల్ల శబ్ద కాలుష్యం పెరుగుతుందన్నారు. కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు. సైలెన్సర్‌కు మార్పులు చేస్తే బైక్ యజమానితో పాటు దానిని బిగించిన మెకానిక్ పైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్ యజమానికి 3 నెలల జైలు, రూ.10 వేల వరకు జరిమానాతో పాటు 3 నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.