గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2024 (17:26 IST)

డిసెంబర్ 5 న పుష్ప పార్ట్ 2: ది రూల్ - ఆనందంలో డిస్ట్రిబ్యూటర్స్‌

Pushpa 2 Distributors
Pushpa 2 Distributors
అల్లు అర్జున్, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్ సన్సేషన్‌ కలయికలో రాబోతున్న చిత్రం  పుష్ప -2. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఒకరోజు ముందుగానే అంటే డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మైత్రీమూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి నవీన్‌ ఎర్నేని. వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదిని తెలియజేయడానికి గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈ చిత్రాన్ని ఇండియా వైడ్‌ పంపిణీ చేస్తున్న నిర్మాతలు కూడా పాల్గొన్నారు.
 
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, "పుష్ప-2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాము. మేము ఇంతకు ముందు చెప్పిన దాని కన్నా ఒక రోజు ముందుగా, అంటే డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. పుష్ప-2  కచ్చితంగా ఒక పెద్ద సినిమా గా మారింది. రిలీజ్ కూడా ఘనంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా అందరి అంచనాలకి మించి ఉండబోతుందని" అన్నారు.
 
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ,  గత రెండు సంవత్సరాల నుంచి ఈ సినిమా ని ఈ రేంజ్ కి తీసుకొచ్చారు హీరో గారు. ఈ సినిమా కోసం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు. హీరో గారు, దర్శకుడు  పగలు రాత్రి కష్టపడి ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని మా అందరికీ నమ్మకం ఉంది. మా తోటి డిస్ట్రిబ్యూటర్లందరికీ అభినందనలు. మా అందరి ముందు పెద్ద గోల్స్ ఉన్నాయి. కానీ మేము అన్నిటినీ చక్కగా అచీవ్ చేస్తాం. 
 
డిసెంబర్ 5 న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వైజాగ్ నుంచి బళ్లారి సాయి, సతీష్, ఈస్ట్ నుంచి రాయుడు, కృష్ణ బన్నీ వాస్, ధీరజ్, వెస్ట్ ఎల్వీఆర్, గుంటూరు యువీ వంశీ, నెల్లూరు భాస్కర్ రెడ్డి, సీడెడ్ అభిషేక్ రెడ్డి మా టీమ్. మేమందరం ఈ సినిమా తో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదం కోరుతున్నాం. సినిమా వర్క్ అంతా బాగా జరుగుతుంది." అని చెప్పారు.
 
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతూ, "నైజం లో మేము ఈ సినిమా విడుదల చేస్తున్నాం. ఈ ఏరియా లో సినిమా పెద్ద నంబర్ ని అచీవ్ చేస్తుంది." అన్నారు.
 
హిందీ కి సంబంధించి ఏఏ సినిమాస్, అనిల్ తడాని మాట్లాడుతూ, "పుష్ప -2 ని విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. బాహుబలి, కేజీఎఫ్ కూడా చేసాము. పుష్ప పార్ట్ 1 కూడా రిలీజ్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2 తో అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టి హిస్టరీ క్రియేట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం.
 
వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ గారు మాట్లాడుతూ "పుష్ప-2  కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా, ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. మా జిల్లా లో డే 1 షేర్ ఏ కాకుండా టోటల్ బిజినెస్ కూడా ఆల్ టైం రికార్డ్ అవుతుంది అని కోరుకుంటున్నాను" అన్నారు.
 
తమిళ్ కి సంబంధించి ఏజీఎస్ డిస్ట్రిబ్యూటర్ మాలి మాట్లాడుతూ, "నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. పుష్ప ఒక బ్రాండ్ గా మారింది. తమిళ్ లో ఈ సినిమా కి పెద్ద రిలీజ్ ఇచ్చాం. పుష్ప-2 కి డబుల్ డిజిట్ ఓపెనింగ్ ఉంటుంది అని మేము విశ్వసిస్తున్నాం. మేము ఇటీవలే 806 స్క్రీన్స్ లో విజయ్ గోట్ సినిమా విడుదల చేసాం. పుష్ప ని కూడా అన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం. బాహుబలి 2 తమిళ్ లో 80 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసింది. పుష్ప ఆ నంబర్ ని టచ్ చేస్తుందని అనుకుంటున్నాను." అన్నారు.
 
మలయాళం కి సంబందించిన ఈ4 ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూటర్ ముకేశ్ మెహతా మాట్లాడుతూ, "పుష్ప -2తో మేము 12 కోట్ల మార్క్ ని టచ్ చేయాలని అనుకుంటున్నాం. లియో కలెక్ట్ చేసిన నంబర్ అది. అంతే కాకుండా, 24 గంటలు ఈ సినిమా కి సంబందించిన షోస్ వెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం." అని తెలిపారు.
 
కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, "కర్ణాటకలో క్రేజీ బిజినెస్ చేస్తాం. కర్ణాటకలో ఒక సినిమా చేసిన అత్యధిక బిజినెస్ 90-95 కోట్ల రూపాయలు. కర్నాటకలో అల్లు అర్జున్ కెరీర్‌లో పుష్ప ఒక మైలురాయిగా నిలిచిపోయేలా చూస్తాం. దాదాపు 500 స్క్రీన్లలో సినిమాను విడుదల చేసి నైట్ షోలు కూడా ప్లాన్ చేస్తాం. KGF 2 350 సింగిల్ స్క్రీన్‌లలో విడుదలైంది. పుష్ప 2 500 సింగిల్ స్క్రీన్లలో విడుదల కానుంది. KGF2 ఓపెనింగ్ డే కలెక్షన్ దాదాపు ₹30 కోట్లు. మేము దానిని ఖచ్చితంగా అధిగమిస్తాము" అన్నారు.