సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (19:08 IST)

పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ క్లారిటీ రాబోతుంది

Pushpa2 poster
Pushpa2 poster
ఫుష్ప2 సినిమా మార్కెటింగ్ విషయంలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటినుంచీ ఓ ప్రణాళిక ప్రకారం టిక్కెట్ల క్రమవిక్రయాలను ఏవిధంగా అమలు చేయాలో దర్శకుడు సుకుమార్ ముందడుగు వేస్తున్నారు. ఇటీవలే దేవర సినిమా టికెట్ల రేట్లు పెంచడం థియేటర్లులో ఇతర సినిమాలు రిలీజ్ లేకపోవడం వంటి జాగ్రత్తలతోపాటు ఓవర్ సీస్ లో ప్రీ బుకింగ్ అనేవిధానాన్ని అమలు చేస్తున్నారు. 
 
దేవర క్రేజ్ అమెరికాలో చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని బీట్ చేసి తగ్గేదేలే అన్నట్లు వుండాలని సుకుమార్ ప్లాన్. అందుకు తగినవిధంగా విదేశాల్లో మెగా ఫ్యాన్స్ తోపాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రేజ్ ను యూజ్ చేసేవిధంగా తయారుచేస్తున్నారు. దేవర వసూళ్లు 500 కోట్లు దాటడం కూడా అల్లు అర్జున్ కూడా అంతకుమించి వుండాలని అనుకుంటున్నారు. దీనితో ఈ మార్కెట్ విషయంలో ఇప్పుడు బన్నీ కాస్త క్రేజీగా ప్లాన్ చేస్తున్నట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఇప్పుడు సినిమా కోసం 7 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా 40 రోజులకు పైగా సమయం ఉంది. ఇంకా ఫ్యాన్స్ అంచనాల ప్రకారం 7 లక్షల లెక్క 2 మిలియన్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. 
 
కాగా, సినిమా షూటింగ్ కూడా ఇంకా కొనసాగుతుంది. అది ఎంతవరకు అయింది. ప్రస్తుతం మార్కెట్ ఎలా వుందనే విషయాలను గురువారంనాడు పుష్ప 2 టీమ్ మీడియా ముందుకు రాబోతుంది. దానిలో మరిన్ని విషయాలకు సమాధానం రానున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కనుక మీట్ లో హాజరైతే పొలిటికల్ ఇష్యూ కూడా ఎంతోకొంత వివరించే ఛాన్స్ వుందని సినీవర్గాలు తెలియజేస్తున్నాయి.