అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్‌ల పుష్ప- 2 ది రూల్ ఫస్టాఫ్ లాక్
The Rule First Off Lock poster
డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్ లాక్ చేశారు.. ఈ ఫస్ట్‌హాఫ్ అద్బుతంగా వుందని, ప్రేక్షకులు ఎంత ఊహించుకున్నా అంతకు తగ్గేదేలే లా వుందని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్‌ను జరుపుకుంటునే మరోవైపు నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది.
ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, రెండు పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబరు 6న పుష్ప-2 క్రియేట్ చేయబోయే రిక్డార్డుల గురించి అందరి రెడీ కావాల్సిందే. అంతేకాదు ఈ చిత్రం రిలీజ్‌క ముందే 1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తిచేసిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
