గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (14:21 IST)

ధూం ధాం కోసం చేతన్ మద్దినేని స్టైలిష్ మేకోవర్ సోషల్ మీడియాలో వైరల్

Chetan Maddineni
Chetan Maddineni
ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు యంగ్ టాలెంటెడ్ హీరో చేతన్ మద్దినేని. ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రంలో స్టూడెంట్ లుక్స్ లో కనిపించారు చేతన్ మద్దినేని. ఆయన తన కొత్త సినిమా ధూం ధాం కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ స్టైలిష్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఫస్ట్ ర్యాంక్ రాజు, ధూం ధాం సినిమాల కోసం చేతన్ లుక్స్ ను పోల్చుతూ సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. చేతన్ మద్దినేని లుక్స్ సరికొత్తగా కనిపించేందుకు ధూం ధాం సినిమా టీమ్ ది బెస్ట్ స్టైలిస్ట్ లను హైర్ చేసింది. అల్లు అర్జున్ సహా టాప్ సెలబ్రిటీలకు కాస్ట్యూమ్ స్టైలిష్ట్ గా పనిచేస్తున్న అశ్విన్..చేతన్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. మహేశ్ బాబుతో పాటు మరికొందరు స్టార్స్ కు హెయిర్ డ్రెస్సర్ గా వర్క్ చేసే సోనియా చేతన్ హెయిర్ స్టైల్ డిజైన్ చేశారు. ఈ టాప్ స్టైలిస్ట్స్ ధూం ధాం సినిమాకు చేతన్ లుక్స్ కంప్లీట్ గా మార్చేశారు. 
 
ధూం ధాం చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ధూం ధాం సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.