గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (16:40 IST)

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

NRIs  dances at New York's Time Square
NRIs dances at New York's Time Square
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
ఈ నేపథ్యంలో "ధూం ధాం" సినిమా ప్రమోషన్స్ అమెరికాలో కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఈ సినిమాలోని 'మల్లెపూల టాక్సీ..' పాటను ప్రదర్శించారు. ఈ పాట స్క్రీనింగ్ కు పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ముఖ్యంగా తెలుగు వారు 'మల్లెపూల టాక్సీ..' పాటకు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఈ పాటకు మన వాళ్లు చేస్తున్న సందడి అమెరికన్స్ దృష్టిని కూడా ఆకట్టుకుంది. ఈ నెల 12వ తేదీన "ధూం ధాం" సినిమా యూఎస్ ప్రీమియర్స్ మొదలవుతున్నాయి.
నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు