బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (17:37 IST)

చైతన్య రావ్, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అమెజాన్ ప్రైమ్‌లో ఆదరణ

Chaitanya Rao, Hebba Patel
Chaitanya Rao, Hebba Patel
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్. చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. చైతన్య రావ్ నటిస్తున్న చిత్రాలన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల జంటకు మంచి మార్కులే పడ్డాయి.
 
‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీకి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.
 
అమెజాన్‌లో ఈ మూవీ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టి పడేస్తోంది.