గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (18:28 IST)

క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న పారిజాత పర్వం

Parijata Parvam poster
Parijata Parvam poster
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది
 
తాజాగా మేకర్స్ టీజర్ ని విడుదల చేశారు. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రలని పరిచయం చేస్తూ ప్రారంభమైన టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకులని అలరించింది. టీజర్ చివర్లో వైవా హర్ష చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ పాత్రల ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. సునీల్ చేతిపై జై చిరంజీవా అనే టాటూ ప్రత్యేకంగా ఆకర్షించింది.
 
దర్శకుడు సంతోష్ కంభంపాటి హిలేరియస్ క్రైమ్ కామెడీని ప్రేక్షకులకు అందించబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. టీజర్ కి కంపోజర్ రీ అందించిన నేపధ్య సంగీతం చాలా గ్రిపింగ్ గా వుంది. బాల సరస్వతి కెమరామెన్ పనితనం బ్రిలియంట్ గా వుంది. విజువల్స్, నిర్మాణ విలవలు ఉన్నతంగా వున్నాయి.
 
సశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహా నిర్మాత.
 ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.