శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మార్చి 2024 (20:42 IST)

విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన జైస్వాల్.. గవాస్కర్ రికార్డుపై కన్ను

Yashasvi Jaiswal
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మస్తు ఫామ్‌లో వున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలతో పరుగుల మోత మోగించిన సంగతి తెలిసిందే. ధర్మశాల టెస్టులోనూ అర్థ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో గవాస్కర్ రికార్డుకు చేరువయ్యాడు. టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటివరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 1970-71లో వెస్టిండీస్ పర్యటనలో గవాస్కర్ 774 పరుగులు చేశాడు. 
 
ప్రస్తుతం జైస్వాల్ ఇంగ్లండ్ తో సిరీస్‌లో 712 పరుగులు చేశాడు. గవాస్కర్ రికార్డుకు జైస్వాల్ మరో 62 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో రెండో స్థానానికి చేరే క్రమంలో జైస్వాల్... మాజీ సారథి విరాట్ కోహ్లీ (692 పరుగుల) రికార్డును అధిగమించాడు.