సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 మార్చి 2024 (12:03 IST)

22 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024 నయా సీజన్.. అత్యధిక ధర పలికిన క్రికెటర్లు వీరే...

ipl2024
గత కొన్నేళ్లుగా క్రికెట్ అభిమానులను కనువిందు చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 పోటీలు ఈ యేడాది 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ టోర్నీ కోసం సెలెక్ట్ అయిన విదేశీ ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా భారత్‌కు వచ్చి ప్రాక్టీస్‌లో నిమగ్నమవుతున్నారు. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో తేలిపోయిన విదేశీ, స్వదేశీ ఆటగాళ్ళు ఈ సీజన్‌లో మాత్రం తమ సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో 2024 సీజన్ కోసం నిర్వహించి ఆటగాళ్ళ వేలం పాటల్లో అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ నిలిచాడు. ఈ ఆటగాడిని రూ.24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గెలుచుకుంది. అలాగే, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమిన్సన్‌‌ను హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు రూ.20.5 కోట్లకు గెలుచుకోగా, అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అలాగే ఈ సీజన్ కోసం అత్యధిక ధర పిలికిన ఆటగాళ్ళ వివరాలను పరిశీలిస్తే, 
 
న్యూజీలాండ్‌ జట్టుకు చెందిన డారిల్ మిచెల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.14 కోట్లకు దక్కించుకుది. భారత్‌కు చెందిన హార్షల్ పటేల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు రూ.11.75 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే, అల్‌జారీ జోసెఫ్‌ రూ.115 కోట్ల ధర పలుకగా రాయల్ ఛాలెంజర్స్ జట్టు కైవసం చేసుకుంది. స్పెన్సర్ జాన్సన్‌ను రూ.10 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. సమీర్ రాజాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.8.4 కోట్లకు కైవసం చేసుకోగా, సౌతాఫ్రికాకు చెందిన రిలో రస్సోను పంజాబ్ కింగ్స్ జట్టు రూ.8 కోట్లకు దక్కించుకుంది. తమిళనాడు బ్యాటర్ షారూక్ ఖాన్‌ను రూ.7.4 కోట్లకు గుజరాత్ టైటాన్ వశం చేసుకోగా, వెస్టిండీస్ బ్యాటర్ రౌమెన్ పావెల్‌ను రూ.7.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది.