శుక్రవారం, 12 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2023 (15:21 IST)

ఐపీఎల్ 2024 వేలం పాటలు : రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయిన ఆటగాడు..

pat cummins
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు మంగళవారం దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ ఆల్‌టైమ్ రికార్డు ధరకు అమ్ముడు పోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రికెటర్ ఏకంగా రూ.20.5 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ దక్కించుకుంది.
 
అలాగే, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ను రూ.14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్‌ సొంతం చేసుకుంది. భారత పేసర్‌ హర్షల్‌ పటేల్‌ను రూ.11.75 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో సెంచరీ సాధించి ఆసీస్‌ను గెలిపించిన ట్రావిస్ హెడ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ రూ.6.8 కోట్లకు కొనుగోలు చేసింది.
 
ఆల్‌రౌండర్ వనిందు హసరంగను కూడా రూ.1.5 కోట్లకు తీసుకుంది. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ను రూ.4.2 కోట్లు పెట్టి పంజాబ్‌ దక్కించుకుంది. శార్దూల్‌ను (రూ.4 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ.1.50 కోట్లు) చెన్నై సూపర్‌ కింగ్స్‌ వేలంలో సొంతం చేసుకుంది. 
 
కాగా, ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక ధర రికార్డు ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ శామ్ కరణ్ పేరిట ఉంది. 2023 సీజన్ కోసం శామ్ కరణ్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.18.5 కోట్లకు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇపుడు ఆ రికార్డును ప్యాట్ కమిన్స్ బద్ధలు కొట్టాడు.