కావ్య పాప బాధపడుతుంటే చూడలేకపోయాను.. రజనీకాంత్
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 2024 కోసం ఇప్పటి నుంచే హైదరాబాదు జట్టును బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఆ జట్టు ఓనర్ కావ్య మారాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు కోచ్ అయిన బ్రియానా లారాను తప్పించి.. అతని స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను కోచ్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టుపై.. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రాన్ని హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య తండ్రి కళానిధి మారన్ నిర్మించారు.
ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జట్టు ఓడినప్పుడు కావ్య పాప నిరాశగా.. బాధపడుతూ వుండటం టీవీలో చూడలేకపోయానని తెలిపారు.
అందుకే హైదరాబాదు ఓడితే టీవీ ఆఫ్ చేసేవాడినని రజనీకాంత్ అన్నారు. హైదరాబాద్ ఐపీఎల్ కప్ కొట్టాలంటే… వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకోవాలి. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌లపై దృష్టి పెట్టాలని రజనీకాంత్ సూచనలు చేశారు.