సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మే 2023 (14:07 IST)

చెన్నై వర్సెస్ గుజరాత్.. మ్యాచ్ చూడలేదా.. గుడ్ న్యూస్ ఇదో..

csk team celebrations
ఐపీఎల్ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి 5వ సారి ఛాంపియన్‌గా నిలిచింది. 
 
గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ ముగించిన తర్వాత, వర్షం కారణంగా చెన్నై జట్టు లేటుగా బరిలోకి దిగింది. దీంతో 15 ఓవర్లు మాత్రమే ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే అర్థరాత్రి మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో మరుసటి రోజు విధులకు వెళ్లాల్సిన పలువురు క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ని వీక్షించలేకపోయారు.
 
ఇలాంటి అభిమానులకు స్టార్ స్పోర్ట్స్ సంతోషకరమైన ప్రకటన చేసింది. స్టార్ స్పోర్ట్స్ తమిళ ఛానెల్ మంగళవారం IPL ఫైనల్‌ను ఉదయం 8.00, మధ్యాహ్నం 12.00, రాత్రి 7.30 గంటలకు తిరిగి ప్రసారం చేసింది.