శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మే 2023 (08:33 IST)

అంబటి రాయుడు అదరగొట్టాడు.. 15 బంతుల్లో 23 పరుగులు

Ambati Rayudu
Ambati Rayudu
అంబటి రాయుడు అదరగొట్టాడు. గుజరాత్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడిన అంబటి రాయుడు మెరుపు ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 
 
25 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి స్థితిలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు.. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో మోహిత్ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6తో లక్ష్యాన్ని తేలిక చేశాడు. అతడు ఔటయ్యేసరికి చెన్నై 15 బంతుల్లో 23 పరుగులు చేయాలి.
 
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి.. ఐపీఎల్‌కు అల్విదా చెప్పడంతో ఇక మైదానంలో కనబడడు. ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 4348 పరుగులు చేశాడు. 23సార్లు 50 పైన స్కోర్లు సాధించాడు. 
 
ముంబై తరపున మూడుసార్లు ఆడిన అంబటి రాయుడు.. చెన్నై తరపున మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.