గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 మే 2023 (19:56 IST)

ఐపీఎల్ ఫైనల్ పోరు రంగం.. నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధం

ipl
ఐపీఎల్ ఫైనల్ పోరు రంగం సిద్ధమైంది. లీగ్ మ్యాచ్‌లు, క్వాలిఫైయర్స్ ముగిసిన వేళ.. ఐపీఎల్ 16 సీజన్ ముగింపు మ్యాచ్‌కు నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. 
 
ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీసీసీఐ... ఫైనల్ మ్యాచ్ ముందు ముగింపు వేడుకలను కూడా అట్టహాసంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దేశీయ సంగీతకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. 
 
గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో కూడా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ పోరు జరుగనుంది. 
 
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే 10సార్లు ఫైనల్‌కు చేరింది. అలాగే చెన్నైతో జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది.