గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (23:33 IST)

హిడింబ ట్రైలర్ అదిరిపోయింది : సాయి ధరమ్ తేజ్ (video)

sai tej, nandita, aswin and others
sai tej, nandita, aswin and others
హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’.  ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.  రెండు విభిన్నమైన టైమ్‌లైన్స్‌లో కంటెంట్ సెట్ చేయడం, విజువల్స్ గ్రాండ్‌ గా ఉండటం, కథ , బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం సినీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.
 
1908లో బంగాళాఖాతంలో బ్రిటీష్‌వారు భారతీయ ఖైదీలను పడవలో తీసుకెళ్తున్న విజువల్ తో  ట్రైలర్ ప్రారంభమవుతుంది. తర్వాత ప్రస్తుతానికి వస్తుంది. హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు హాట్ టాపిక్‌గా మారాయి.  పోలీసులు , హోం మంత్రి పై ఎక్కువ  ఒత్తిడి వుంటుంది. కిడ్నాపర్ ఎరుపు రంగును టార్గెట్ చేస్తున్నాడు. నాలుగు కొమ్ములతో మేక ముసుగును ధరించాడు. ఆ కిడ్నాపర్‌ కి ఏం కావాలి? మిస్సింగ్ కేసులకు 1908లో జరిగిన దానికి సంబంధం ఏమిటి?
 
ప్రతి ఫ్రేమ్‌లో అనీల్ కన్నెగంటి  ఇంటెన్స్ పనితనం కనిపిస్తుంది. మొదటి నుంచి చివరి వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ తో ఎంగేజింగ్‌ గా కథను నడిపించాడు. అశ్విన్ బాబు పోలీస్ ఆఫీసర్‌ గా కనిపించాడు. అతని పాత్రకు డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ని సాలిడ్ గా చేశాడు. నందితా శ్వేత కూడా ఒక పోలీసు అధికారి గా కనిపించింది.
 
సాంకేతిక ప్రమాణాలు అత్యున్నతంగా వున్నాయి.  బి రాజశేఖర్ కెమెరా పనితనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు వేర్వేరు  టైమ్స్ ని  ఎంతో భిన్నంగా చూపించారు.  వికాస్ బాడిస బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళుతుంది.ట్రైలర్ మన దృష్టిని ఇన్స్టెంట్ గా ఆకర్షిస్తుంది, అంచనాలని పెంచుతోంది.
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో  సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. హిడింబ ట్రైలర్ అదిరిపోయింది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అశ్విన్ సినిమా ట్రైలర్ లాంచ్ కి రావడం ఆనందంగా వుంది. క్రికెట్ తో మా పరిచయం ఏర్పడింది. ఈ సినిమా పెద్ద విజయం కావాలి’’ అని కోరారు.
 
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ..  మీ అందరికీ ట్రైలర్ నచ్చడం ఆనందంగా వుంది. నా స్నేహితుడు తేజు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. విరూపాక్ష తో వందకోట్ల క్లబ్ లో తేజు చేరడం నాకు గర్వంగా వుంది.  పవన్ కళ్యాణ్ గారు  మా ఇద్దరికీ ఫేవరేట్. ఇప్పుడు ఆయనతో బ్రో సినిమా చేస్తున్నాడు. ఇది ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. హిడింబ నా కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా చేశారు. దర్శకుడు అనిల్ సినిమా అద్భుతంగా తీశారు. సినిమా అందరినీ ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది. టీం అందరికీ థాంక్స్. అనిల్ సుంకర గారు ఈ సినిమాని ప్రజంట్ చేయడం చాలా ఆనందంగా, పాజిటివ్ గా వుంది’’ అన్నారు.
 
నందిత శ్వేత మాట్లాడుతూ..  ట్రైలర్ లాంచ్ చేసిన తేజ్ గారికి కృతజ్ఞతలు. తేజ్ గారు నాకు స్ఫూర్తి. హిడింబ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. సినిమా ఇంకా అద్భుతంగా వుంటుంది. ఇందులో చాలా కీలకమైన పాత్ర చేశాను. దర్శక నిర్మాతలకు అశ్విన్ కి కృతజ్ఞతలు’’ తెలిపారు.
 
దర్శకుడు అనిల్ మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ చేసిన సాయి ధరమ్ తేజ్ గారికి కృతజ్ఞతలు. ఎలాంటి ఇన్ఫ్లూయెన్స్ లేకుండా ఒరిజినల్ కాన్సెప్ట్ తో తీసిన సినిమా హిడింబ. మా టీం అంతా ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. ఒక ఇన్వెస్ట్ గెట్ థ్రిల్లర్ నుంచి హిస్టారికల్ ఫిక్షన్ కి వెళ్ళే సినిమా ఇది. చాలా డిఫరెంట్  గా , ఫ్రెష్ గా వుంటుంది. గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి. అనిల్ సుంకర గారు ప్రజంట్ చేయడం ఆనందంగా వుంది. శ్వేత అద్భుతంగా నటించింది. అశ్విన్ యాక్టింగ్ స్కిల్స్ ఈ సినిమాతో తెలుస్తుంది. అందరూ అద్భుతంగా చేశారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది’’ అన్నారు.
 
నిర్మాత మాట్లాడుతూ.. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సాయి తేజ్ గారికి కృతజ్ఞతలు. అశ్విన్ గారు, మా స్నేహితులు అందరం కలసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. అశ్విన్ గారి సపోర్ట్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదు’’ అన్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.