శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (12:50 IST)

సాయితేజ్‌ పాత్ర డూప్‌తో ట్రై చేశాం : దర్శకుడు కార్తీక్‌వర్మ దండు

Sai Dharam Tej, Director Karthik
Sai Dharam Tej, Director Karthik
సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం విరూపాక్ష. ఇది మంచి టాక్‌తో రన్‌ అవుతుంది. ఈ సినిమాకు కార్తీక్‌వర్మ దండు దర్శకుడు. ఇతను కార్తికేయ సినిమాకు రైటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత భంబోలేనాథ్‌ అనే సినిమాతో దర్శకుడిగామారాడు. హీరో నవీన్‌చంద్రతో తీశాను. ఆ సినిమాకు రైటర్‌గా ప్రూవ్‌ అయ్యాను. దర్శకుడిగా ప్రూవ్‌ కాలేదు. అందుకే ఛాలెంజ్‌గా తీసుకున్నాను. 2015లో వచ్చిన ఆ సినిమా తర్వాత  గేప్‌ తీసుకుని రాసిన కథే విరూరపాక్ష అని దర్శకుడు తెలియజేస్తున్నారు.
 
2018కు ముందే రాసుకున్న కథ సెట్‌పైకి వెళ్ళడానికి నాలుగేళ్ళు పట్టింది. షూటింగ్‌ అనుభవాలను ఆయన ఇలా తెలియజేస్తున్నారు. 2018 వరకు నేను నమ్మిన కథకు అవకాశాలు రాలేదు. కారణం అప్పట్లో బడ్జెట్‌కు నిర్మాతలు డేర్‌ చేయలేదు. అది నమ్మింది సుకుమార్‌ ఒక్కరే.  అందుకే నేను ఆయనకు చెప్పాలనిపించింది. ఆయన మొదటిరోజునే ఓకే అన్నారు. స్క్రీన్‌ప్లేలో పలు మార్పులు చేశారు.
 
షూటింగ్‌ మొదటిరోజు పెద్ద సెట్‌తో ఏర్పాటు చేసుకుని రేపటికి షెడ్యూల్‌ గురించి ఆఫీసు రూమ్‌లో ప్లాన్‌ చేశాం. అందరి ఫోన్లు సైలెంట్‌ మోడ్‌లో పెట్టాం. ఆఫీసు బాయ్‌ కూడా బయలకు పంపాం. కాసేపటికి అందరి ఫోన్లు ఒకేసారి వైబ్రేషన్‌లో మోగాయి. ఒకసారి టీవీలో న్యూస్‌ చూడండి అన్నారు. అప్పుడే సాయితేజ్‌ వార్త చూసి షాక్‌ అయ్యాం. ఎప్పుడైతే ఆసుపత్రివార్గలు ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేయగానే కాస్త నాకూ మైండ్‌ నుంచి రిలీఫ్‌ అనిపించింది. అలా సినిమా కష్టాలు పడ్డాం. 
 
ఇక పూర్తిగా కోలుకుని షూటింగ్‌కు వచ్చాక సాయితేజ్‌ మూడు రోజులు ఇబ్బంది పడ్డాడు. ఆ మూడు రోజులు డూప్‌తో ట్రై చేశాం. నాల్గవరోజు నుంచి ఆయనే నేరుగా షూట్‌లో పాల్గొన్నారని దర్శకుడు తెలిపారు. సాయితేజ్‌కు మాట సరిగ్గా వచ్చేదికాదు. స్పీచ్‌ థెరపీ. బాడీ ఎక్సర్‌సైజ్‌ వంటివి నేర్చుకుని మరలా షూట్‌లో పాల్గొన్నారు. ఈలోగా వేరే సీన్స్‌ చేశాం అని తెలిపారు.