గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (18:22 IST)

సాయి తేజ్ కు తీపి తినిపిస్తున్న కొణిదల సురేఖ

Konidala Surekha feeding payasam to Sai Tej
Konidala Surekha feeding payasam to Sai Tej
సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఈరోజే విడుదల అయింది. మంచి టాక్ తో రన్ అవుతుంది. ఆరోగ్యంగా కోలుకొని సినిమా చేసిన సాయి ధరమ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. తను నమ్ముకున్న ఆంజనేయ స్వామిపై భారం వేసి ముందుకు సాగాడు. సినిమా విడుదలకు ముందు నుంచి ఈ సినిమా అలరిస్తుంది అని ఘంటా పదంగా హెసెప్పాడు.  అది నేడు నిజమైంది.
 
chiru tweet
chiru tweet
ఇది తెలిసి సాయి ధరమ్ తేజ్ ఇంట్లో సందడి నెలకొంది. అందరికి థాంక్స్ చెప్పాడు. చిరంజీవి ప్రతేకంగా పిలిచి ఇలా తీపి తినిపించాడు. ఈ విషాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
విరూపాక్ష గురించి అద్భుతమైన నివేదికలు వినబడుతున్నాయి.  నేను మీ కోసం చాలా సంతోషంగా ఉన్నాను ప్రియమైన సాయి తేజ్.. మీరు సక్సెస్ చప్పుడుతో తిరిగి వచ్చేలా చేసారు. మీ సినిమాను ప్రేక్షకులు అభినందిస్తున్నందుకు మరియు ఆశీర్వదిస్తున్నందుకు ఆనందంగా ఉంది.  మొత్తం టీమ్‌కి హృదయపూర్వక అభినందనలు అని పోస్ట్ చేశారు. కొణిదల సురేఖ గారు తీపి తినిపిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు.