శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (22:37 IST)

రెజీనా అంటే ఇష్టం.. కానీ 'తిక్క' హీరోయిన్‌ను ప్రేమించాను : సాయి ధరమ్ తేజ్ (video)

Sai Dharam Tej
హీరోయిన్ రేజీనా అంటే తనకు అమితమైన ఇష్టమని, కానీ, 'తిక్క' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన లారిస్సా బొనేసిని ప్రేమించానని మెగా కాంపౌడ్ హీరో సాయి ధరమ్ తేజా తన మనస్సులోని మాటను వెల్లడించారు. తాను నటించిన కొత్త చిత్రం "విరూపాక్ష". ఈ నెల 21వ తేదీన విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ, నేను అభిమానించే హీరోయిన్ సమంత. తనని నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఇక నా కెరియర్ తొలి నాళ్ళలో నాతో సినిమాలు చేసినా రెజీనా, సయామీ అంటే ఇష్టం అని చెప్పారు. 
 
నేను ప్రేమించింది మాత్రం "తిక్క" చిత్రంలో నాతో పాటు నటించిన లారిస్సా బొనేసి. ఆమెను నేను చాలా గాఢంగా ప్రేమించాను. ఆ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగు జరుగుతూ ఉండగా, నా మనసులోని మాటను చెప్పాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంటూ ఆమెకి విషయం చెప్పేశాను. సారీ తేజూ ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుఅని చెప్పేసింది. అపుడు మాత్రం నా హార్ట్ బ్రేక్ అయింది.
 
అదేవిధంగా నేను డిగ్రీ చదవుతున్న రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాను. కాకపోతే, డిగ్రీ పూర్తయిన తర్వాత ఆ అమ్మాయికి నేనే దగ్గరుండి మరో అబ్బాయితో పెళ్లి చేసి పంపించాను. ఈ విషయం మా అమ్మకు, మా కళ్యాణ్ మామయ్యకు మాత్రమే తెలుసు. ఇపుడు మాత్రం "సోలో బ్రతుకే సో బెటర్" అన్నట్టుగా నా పని నేను చేసుకునిపోతున్నాను అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.