శుక్రవారం, 7 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2025 (18:56 IST)

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

komatireddy venkat reddy
తమ డిమాండ్ల పరిష్కారం కోసం అనేక మందికి జీవనోపాధి కల్పిస్తున్న సినిమా షూటింగులను బంద్ చేయడం ఏమాత్రం సబబు కాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పైగా పని చేస్తూనే తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. వేతన పెంపు కోసం డిమాండ్ చేస్తున్న సినీ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రి సోమవారం సమావేశమయ్యారు. మరోవైపు, సినీ నిర్మాత, ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు కూడా మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై ఆయన మంత్రి కోమటిరెడ్డికి దిల్ రాజు వివరించారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, పని చేస్తూనే తమ డిమాండ్స్‌ను నెరవేర్చుకోవాలని సినీ కార్మికులకు పిలుపునిచ్చారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుదన్నారు. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమార్గమన్నారు. పట్టువిడుపులతో ఉండాలని నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులకు మంత్రి సూచించారు. 
 
ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేసమయంలో మంగళవారం కూడా మరోమారు నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రితో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరినట్టు చెప్పారు.