సంబంధిత వార్తలు
- మాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్... పడక సుఖం ఇస్తేనే సినిమా ఛాన్స్ : సనమ్ శెట్టి
- మనిషిని చూసి జడుసుకుని తోక ముడిచి పరుగులు తీసిన పులి (video)
- తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)
- నా స్కూటీ నాకిచ్చేయండి... వా... అంటూ పోలీసుల వద్ద ఏడ్చిన యువతి (video)
- ఉన్నది లేనట్లుగా, లేనిది వున్నట్లుగా చూపిస్తున్న AI, వేల మంది ఉద్యోగుల్ని రోడ్డుపై పడేస్తోంది (video)
Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)
Sanam Shetty
కరోనా పాండమిక్, తుఫానులు, వర్షాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో, ప్రజల సంక్షేమాన్ని ముఖ్యమైనదిగా భావించి, తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అపారమైనది. ఇంత అంకితభావంతో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతగా, చెన్నై కార్పొరేషన్‌లో పరిశుభ్రత పనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వారి జీవనోపాధిని కోల్పోవడం సరికాదన్నారు.
ఇంకా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ ఫైర్ అయ్యారు. పారిశుద్ధ్య కార్మికులు తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి పగలు, రాత్రి పోరాడుతున్నారు. తమిళనాడు వెట్రి కళగం వారి నైతిక పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తుందని విజయ్ ప్రకటించారు. ఇదే తరహాలో సినీ నటి సనమ్ శెట్టి కూడా పారిశుద్ధ్య కార్మికులకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ.. వారు నిరసన చేపట్టిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారితో నిరసనలో కూర్చున్నారు. వారికి మద్దతిస్తామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు డీఎంకే ఇచ్చిన వాగ్ధానాన్ని విస్మరించిందని ఫైర్ అయ్యారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్టుల నుంచి పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి.. ప్రస్తుతం చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ క్లీనప్ పనులు ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడంతో పాటు అదే జీతాన్ని తగ్గకుండా వారికి అందించాలనే డిమాండ్‌లను నెరవేర్చాలని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి.. పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల పాలన ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ఎన్నికల ప్రచారాలకు వెళ్లకుండా.. పారిశుద్ధ్య కార్మికుల నిరసనను పట్టించుకోవాలని.. వారి జీవనోపాధికి సరైన సాయం అందించాలని డిమాండ్ చేశారు.
என்னுடைய நண்பர்கள்... உங்க வாக்குறுதியை தான் கேக்குறாங்க.. இனிமேல் ஓட்டு கேட்டு எப்படி வருவீங்க... சனம் ஷெட்டி ஆவேசம்.!#Chennai #SanamShetty #SanitaryWorkers #Sanitaryworkersprotest #TamilNews #Newstamil #NewsTamil24x7 pic.twitter.com/QrvrcLxSBW
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) August 11, 2025
