శుక్రవారం, 9 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 24 డిశెంబరు 2025 (22:48 IST)

మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?

Sweet potato
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము.
 
బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి.
స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు.
అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది.
తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి.
తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి.
పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
ఊరగాయ పచ్చళ్లకు కూడా దూరంగా వుండాలి.
బెల్లంతో చేసిన వేరుశెనగ ముద్దలు, నేతిలో వేయించిన జీడిపప్పులు తినడం మధుమేహం ఉన్నప్పుడు మంచిది కాదు.