సాయితేజ్, సంయుక్త డ్రెస్ కోడ్ వెనుక రహస్యం ఏమిటో తెలుసా!
సాయిధరమ్ తేజ్, సంయుక్తమీనన్ కలిసి నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకుడు. ఈ సినిమాను బివిఎస్‌ఎన్ ప్రసాద్, బన్నీవాసు నిర్మించారు. ఈ శుక్రవారమే విడుదలకానుంది. సినిమా ప్రమోషన్ సందర్భంగా హీరోహీరోయిన్లు ఇద్దరూ సాంప్రదాయదుస్తులు ధరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. సంయుక్తమీనన్ తన కేరళ సంప్రదాయప్రకారం తెల్లటి దుస్తులు ధరించింది. ఇక సాయితేజ్ మాత్రం నల్లటి లుంగీ, చొక్కాతో దర్శనమిచ్చాడు. ఈడ్రెస్ కోడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సాయితేజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను గోల్డ్ స్పూన్‌తో పుట్టానని స్నేహితులు, క్రిటిక్స్ అంటున్నారు. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి రంగుపడుతుంది. ఆ తర్వాత నాకు ఏక్సిడెంట్ అయ్యాక ఆంజనేయస్వామి దయ వల్ల నేను కోలుకున్నా. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. అందుకే ఆ శక్తిని జీవితాంతం రుణపడి వుంటానని అన్నాడు. కానీ ఇప్పటికే సాయితేజ్‌కు నరదిష్టి ఎక్కువగా వ ఉండడంతో అందుకు సంబంధించిన వస్త్రదారణలో భాగంగా ఇలాంటి డ్రెస్‌వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజుకూడా బ్లాక్ ఫ్యాంట్ వేసుకుని ప్రమోషన్‌లో పాల్గొన్నారు. ఇక సంయుక్త తనకు సెంటిమెంట్‌గా తెల్లటి వస్త్రాలు వుంటాయనీ, ఈ సినిమా విజయం కావాలని కోరుకుంటూ తానొక పూజ చేస్తున్నట్లు తెలిసింది. సో. విరూపాక్ష విజయం కోసం ఇద్దరూ తెగ తపిస్తున్నారు.