1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (11:02 IST)

అల్లుఅర్జున్ మరింత ఎదగాలన్న చిరంజీవి

bunny, chiru
bunny, chiru
చిరంజీవిని స్ఫూర్తి గా తీసుకొని డాన్స్ లో తనకంటూ సెపరేట్ గుర్తింపు పొందిన కుటుంబ హీరో అల్లుఅర్జున్. నేటితో అల్లుఅర్జున్ సినిమా కెరీర్ 20 సంవత్సరాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్ప 2 షూటింగ్లో ఉన్న ఆయనకు చిరంజీవి విషెస్ తెలుపుతూ మరింతగా ఎదగాలని ఆకాక్షించారు.
 
బన్నీ సినిమా 100 డేస్ సభ ఫోటో పెట్టి ట్విట్టర్లో ఇలా తెలిపారు.  మీరు చాలా హృదయపూర్వకంగా చిత్రాలలో 20 సంవత్సరాలను పూర్తి చేసారు ఆనందంగా ఉంది. ప్రజల్లో  ఒక సముచిత స్థానాన్ని పొంది పాన్ ఇండియా స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా ఎదిగారు. పుష్ప తో  స్థాయి పెరిగింది. ఇంకా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని,  మరెన్నో హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.