1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: బుధవారం, 29 మార్చి 2023 (10:57 IST)

కుష్బూకి సాదరంగా ఆహ్వానం పలికిన మెగాస్టార్ చిరంజీవి

Kushboo, Megastar Chiranjeevi
Kushboo, Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కుష్బూకు సాదరంగా ఆహ్వానం పలికారు. తను హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సెట్లో కుష్బూకు బొకేతో వెల్కమ్ పలికారు. స్టాలిన్ సినిమా తరవాత మరలా కలిసి చేస్తున్న సినిమా ఇది. అన్నయ్య సినిమాలో నటించడం ఆనందంగా ఉందని కుష్బూ తెలిపింది. ఈ సినిమాలో ఆమె పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. నిన్న ఆమె భోళా శంకర్ సెట్‌కు వెళ్లారు. చిరంజీవి, కుష్బూ కాంబినేషన్ సీన్స్ తీశారు. 
 
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే భోళా శంకర్ తాజా షెడ్యూల్ ప్రారంభమైంది.  హైదరాబాద్‌లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో చిరంజీవితో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఓ సాంగ్ షూట్ తీశారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.