1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: శుక్రవారం, 24 మార్చి 2023 (14:45 IST)

నితిన్, రష్మిక మందన చిత్రం మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ప్రారంభం

Megastar Chiranjeevi, Nithin, Rashmika Mandana,
Megastar Chiranjeevi, Nithin, Rashmika Mandana,
వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన తమ గత  చిత్రం ‘భీష్మ’ కంటే పెద్ద విజయాన్ని అందించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది.  ఈ చిత్రం మరింత వినోదాత్మకంగా, మరింత అడ్వెంచరస్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈరోజు గ్రాండ్‌ గా ప్రారంభమైయింది.
 
ముహూర్తం షాట్‌ కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా, దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. గోపీచంద్ మలినేని తొలి షాట్‌ కి దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి, బుచ్చిబాబు సాన స్క్రిప్ట్‌ ని మేకర్స్‌ కి అందజేశారు.
 
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో  ప్రముఖ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో భాగం కానున్నారు.
 జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.