ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (09:55 IST)

కోట శ్రీనివాసరావుగారు ఆరోగ్యంగానే వున్నారు

Kota Srinivasa Rao
Kota Srinivasa Rao
సీనియర్‌ నటులు కోట శ్రీనివాసరావుగారి ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో నేడు చర్చ జరుగుతోంది. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవలే నటుడు చలపతిరావు మరణించినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దర్శకుడు కె. విశ్వనాథ్‌ కుటుంబాన్ని కూడా కోటగారు పరామర్శించారు. 
 
తాజాగా ఆయన ఓ సినిమాలో కూడా నటించారు. ఆ ఫొటో బయటకు వచ్చింది. దానితో ఆయన ఆరోగ్యం బాగోలేదని చర్చ జరుగుతోంది. దీనిపై కోట శ్రీనివాసరావుగారి మేనేజర్‌ సురేష్‌ ప్రకటన చేశారు. కోట శ్రీనివాసరావు గారి తోటి ఇప్పుడే మాట్లాడాను ఆయన పూర్తి ఆరోగ్యంతో బ్రహ్మాండంగా ఉన్నారు అని తెలిపారు.