ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
రామ్‌చరణ్ లైఫ్‌లోకి వచ్చినందుకు ఉపాసన కామినేని కొణిదలకు హీరో అల్లు అర్జున్ విషెస్ చెప్పారు. కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాలో ఉపాసనతో వున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఉప్సి ఆర్.సి. లైఫ్. సో హ్యాపీ మై స్వీటెస్ట్ ఉప్సీ.. అంటూ అల్లు అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం ఉపసాన గర్భవతి అన్న విషయం తెలిసిందే. దేవుడు ఇచ్చిన పవిత్రమైన జన్మకు సార్థకం చేసేదిశలో ఉపాసన, రామ్‌చరణ్ ఉన్నందుకు ఆనందంగా ఆయన విషెష్ చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం రామ్‌చరణ్ తన భార్య ఉపాసన దగ్గరే స్పెండ్ చేస్తున్నారు. ఆమెను కంటిరెప్పలా కాపాడుకునే బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మహిళకు ఇది జీవితంలో వెలకట్టలేని సమయం. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్ కాస్త గేప్ ఇచ్చారు. చిత్ర దర్శకుడు సుకుమార్, నిర్మాతల కార్యాలయాపై ఐ.టి. దాడులు జరిగాయి.