గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 మే 2023 (14:59 IST)

ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం - చీఫ్‌గా తోట చంద్రశేఖర్

brslogo
భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖ కార్యాలయాన్ని ఏపీలో ప్రారంభించారు. గుంటూరులో ఐదు అంతస్తుల భవనంలో పార్టీ ఆఫీసును నెలకొల్పారు. దీన్ని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ఆదివారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. 
 
2024 అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ ప్రారంభించారు. కాగా, ఐదు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో కార్యకర్తలతో సమావేశ మందిర, రెండు మూడు అంతస్తుల్లో పరిపాలను విభాగాలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. 
 
ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తుందని తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడు ప్రదర్శిస్తుందన్నారు,.
 
పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే మహారాష్ట్రలో పలు సభలు, సమావేశాలు నిర్వహించారని తెలిపారు. మహారాష్ట్ర, ఏపీలతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా  సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలతో పాటు పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.