1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 26 మే 2023 (14:02 IST)

ఎంఎస్ ధోనీపై ఒక మ్యాచ్ నిషేధిస్తారా?

Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం వుంది. ఐపిఎల్ 2023 ఫైనల్ ఆడకుండా నిషేధానికి గురి కావచ్చు. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ అయిన ధోనీ.. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లు విలువైన నాలుగు నిమిషాలను వృధా చేసినందుకు గాను.. ఈ నిషేధం తప్పదని సమాచారం. 
 
స్లో రేట్ కారణంగా ఒకప్పుడు ధోనీ ప్రవర్తనా నియమావళికి జరిమానా విధించబడింది. మే 28, ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ ఆడకుండా నిషేధానికి గురికావచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను 15 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 10వ ఫైనల్‌కు అర్హత సాధించింది.