శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (10:28 IST)

చెన్నై సూపర్ కింగ్స్ అదుర్స్.. ఐపీఎల్ ఫైనల్లోకి ఎంట్రీ.. రికార్డు

chennai super kings
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫయర్-1లో సీఎస్కే 15 పరుగుల తేడాతో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని సీఎస్కే విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
మొదటగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేవలం ఐదుగురు బౌలర్లతోనే గుజరాత్ టైటాన్స్ పనిబట్టాడు ధోనీ. దీంతో క్వాలిఫైయ‌ర్1లో 15 పరుగుల తేడాతో విజయం సాధించిన చైన్నై ఐపీఎల్ 16వ సీజ‌న్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. 
 
చెన్నై ఇలా ఫైనల్‌కు వెళ్లడం పదోసారి. ఈ నెల 28న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ విజేతతో తలపడనుంది.