సొంత గడ్డపై కేక.. ముంబైని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపును నమోదు చేసుకుంది. ముంబై ఇండియన్స్‌పై ఆరు వికెట్ల తేడాతో చెన్నై గెలవడంతో పాయింట్ల పట్టికలో ధోనీ సేన రెండో స్థానానికి చేరుకుంది. ఆద్యంతం ధోనీ సేన ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంటుంది.
చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పసుపు జట్టు ముంబైకి చుక్కలు చూపించింది. తొలుత ముంబయిని 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులతో కట్టడి చేసిన చెన్నై, అనంతరం 140 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది.
చెన్నై ఆటగాళ్లలో డెవాన్ కాన్వే 44, రుతురాజ్ 30 పరుగులు, రహానే 21 పరుగులు సాధించారు. అంబటి రాయుడు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. దూబే 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ముంబయి ఇండియన్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 2, ట్రిస్టాన్ స్టబ్స్ 1, ఆకాశ్ మధ్వాల్ 1 వికెట్ తీశారు. ఇక సీఎస్‌కే చేతిలో కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఓడింది. 13 సంవత్సరాల తర్వాత చేపాక్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన రికార్డును చెన్నై తన ఖాతాలో వేసుకుంది.