ఆదివారం, 17 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (12:40 IST)

లక్నోకు షాక్... గాయంతో ఐపీఎల్‌కు దూరమైన కేఎల్ రాహుల్

kl rahul
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ నుంచి కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం కారణంగా ఆయన టోర్నీ నుంచి తప్పుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆటగాడిగా ఉన్న రాహుల్... ఆ జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. 
 
మంగళవారం బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిల్డింగ్ చేస్తుండగా రాహుల్ గాంయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో తొండ కండరాలు పట్టేశాయి. దీంతో మైదానం వీడాడు. బ్యాటింగ్ సమయంలోనూ రాహుల్ చివరి ఆటగాడిగా క్రీజ్‌లోకి వచ్చినా వికెట్ల మధ్య పరుగెత్తలేక పోయాడు. పైగా, ఆయనకు తగిన గాయం పెద్దది కావడంతో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌తో జూన్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. రాహుల్ గాయం ఇపుడు లక్నో జట్టుకు, తర్వాత భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
 
మరోవైపు, లక్నో జట్టుకు చెందిన మరో ఆటగాడు జైదేవ్ ఉనద్కట్ సైతం ప్రాక్టీస్‌లో గాయపడ్డాడు. అతని ఎడమ భుజానికి తీవ్రగాయమైనట్టు తెలుస్తుంది. ఉనద్కట్ కూడా వరల్డ్టెస్ట్ చాంపియన్‌షిప్ జట్టులో ఉన్నాడు. ప్రస్తుతం సమాచారం మేరకు రాహుల్, ఉనద్కట్ ఇద్దరూ ఈ వారంల జాతీయ క్రికెట్ అకాడెమీలో రిపోర్టు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా, కేఎల్ రాహుల్‌ను స్కాన్, ఇతర వైద్య పరీక్షల కోసం ముంబైకు తరలించారు.