ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (11:37 IST)

ఐసీసీ వన్డే ప్రపంచ కప్.. భారత్‌ వేదికల జాబితా సిద్ధం

World Cup
ఐసీసీ 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ కోసం భారత్‌లోని వేదికల జాబితాను ఐసీసీ సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఐసీసీ 50 ఓవర్ల ప్రపంచకప్ ఈ ఏడాది భారత్‌లో జరగనుండగా.. ఈ మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరిగే ఈ మ్యాచ్‌ల్లో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సహా పలు దేశాల జట్లు తలపడనున్నాయి. 
 
భారత్‌లో ఈ మ్యాచ్‌లను ఏ వేదికలపై నిర్వహించాలనే దానిపై ఐసీసీ ఆలోచిస్తోంది. నివేదికల ప్రకారం, ICC ఎంపిక చేసిన వేదికలు చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, లక్నో, గౌహతి, హైదరాబాద్, రాజ్‌కోట్, కోల్‌కతా, తిరువనంతపురం, ఇండోర్, ధర్మశాల, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయని కూడా చెబుతున్నారు.