మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (18:07 IST)

విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ధోనీకి కెప్టెన్సీ గురించి టిప్స్ ఇచ్చాడు

Kohli
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. విమాన ప్రయాణంలో ఓ అభిమాని చేసిన హంగామా గురించి చెప్పుకొచ్చాడు. సదరు వ్యక్తి ఓ కార్పొరేట్ సంస్థలో ఉన్నత స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. ఆ అభిమానితో జరిగిన ముచ్చట్లను గుర్తు చేసుకున్నాడు. 
 
టీమిండియా సభ్యులం కోచి నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్నాం. ఆ విమానంలో ఓ అభిమాని ఎంతో ఉత్సాహంతో మా వద్దకు వచ్చాడు. చెన్నైకి చెందిన ఆ అభిమాని అనుకుంటా.. వచ్చీ రాగానే ధోనీ వద్దకు వెళ్లి మాట్లాడటం మొదలు పెట్టాడు. కెప్టెన్సీ గురించి టిప్స్ ఇచ్చాడు తుది జట్టు ఎంపికపైనా సూచనలు చేశాడు. 
 
ఎంఎస్ మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయాడు. చాలా ఓర్పుగా ధోనీ అతడు చెప్పిన మాటలు విన్నాడు. కాసేపటికి ధోనీ దగ్గర నుంచి అభిమాని తన సీటుకు వెళ్తుంటే మధ్యలో తాను కనిపించా. వెంటనే తన వద్దకు వచ్చాడు. ఏమైందని అని అడిగాను. అదే తన బ్యాటింగ్ సంగతేంటని ప్రశ్నించాడని విరాట్ చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత ఆడిన మ్యాచుల్లో తర్వగా ఔట్ అయిపోయానని తెలిపాడు.