గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (22:01 IST)

పసుపు రంగు జెర్సీ ధరించి.. అందరి జీవితాల్లో ఉదయించాడు.. (వీడియో)

Dhoni
Dhoni
చెన్నై సూపర్ కింగ్స్- లక్నో జట్ల మధ్య మంగళవారం తలపడనున్నాయి. ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తెలుగు ప్రత్యేక ప్రోమో విడుదల చేసింది. టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ విశిష్టతలను వివరించే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
15 ఏళ్ల కిందట ఓ సూర్యుడు పసుపు రంగు జెర్సీ ధరించి మనందరి జీవితాల్లో ఉదయించాడంటూ బాలయ్య ఆకాశానికెత్తేశాడు. ఆ నెం.7 జెర్సీతో కనెక్ట్ అయినప్పుడు జట్టులోకే కాదు నేరుగా అభిమానుల గుండెల్లోకి ప్రవేశించాడు. 
 



 
టాలెంట్ వల్ల బెస్టాఫ్ ద బెస్ట్ కూడా అతడిని ఓడించలేకపోయింది. కొందరికి మహి... కొందరికి కెప్టెన్ కూల్. ఆ తర్వాత 'తలా' అయ్యాడు. ఇలాంటి అద్భుత క్షణాలను లెక్కలేనన్ని అందించినందుకు ధన్యవాదాలు తలా అంటూ బాలయ్య తనదైన శైలిలో ప్రోమోను అదరగొట్టారు.