1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (19:02 IST)

వాఖండే స్టేడియంలోని సీటుకు ఎంఎస్ ధోనీ పేరు..

singam dhoni
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వాంఖడే స్టేడియం వేదికపై 12 సంవత్సరాల క్రితం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం ఎంఎస్ ధోని పేరు పెట్టాలని నిర్ణయించింది. 50 ఓవర్ల ప్రపంచకప్‌ కోసం భారత్‌ 28 ఏళ్ల నిరీక్షణకు ధోనీతో తెరపడిన సంగతి తెలిసిందే. 
 
ఎంసీఏ పెవిలియన్‌లో ఆరుగురు దిగిన స్థలాన్ని గుర్తించామని.. ఆ ప్రాంతానికి అతి త్వరలో శాశ్వతంగా ఎంఎస్ ధోని పేరు పెట్టనుంది. రాష్ట్ర బోర్డు ప్రారంభోత్సవానికి 41 ఏళ్ల క్రికెటర్‌ను కూడా ఆహ్వానించిందని, అతనికి జ్ఞాపికను అందజేయాలని ఎంసీఏ యోచిస్తోంది.  
 
కాగా.. శ్రీలంకతో ఫైనల్‌లో ధోని కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ కొట్టి కోట్లాది భారతీయు కలను నిజం చేశాడు. నాడు ధోని కొట్టిన సిక్స్‌.. స్టేడియంలో ఓ సీటుపై పడింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్‌ అమోల్‌ ఖేల్‌ వెల్లడించారు.

వాంఖడే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు ఇప్పటికే సచిన్‌, గవాస్కర్‌, విజయ్ మర్చంట్‌ పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వినూత్నంగా సీటుకు ధోని పేరు పెడుతున్నారు.