శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (17:54 IST)

నోబాల్స్ వేస్తే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది.. ధోనీ

Dhoni
ఐపీఎల్ 16వ సీజన్‌ పోటీల్లో భాగంగా, సోమవారం రాత్రి లక్నో సూపర్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు 12 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్కే కెప్టెన్ ధోనీ తన జట్టు బౌలర్లతో మాట్లాడుతూ, ఫాస్ట్ బౌలర్లు తమ బౌలింగ్‌ను మెరుగుపరుకోవాలని, పరిస్థితులను బేరీజు వేస్తూ బౌలింగ్ చేయాలంటూ సూచించారు. 
 
అదేసమయంలో నోబాల్స్, వైడ్ బాల్స్ వేయొద్దని ఒకవేళ వేస్తే కనుక కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరించారు. పైగా, ఇది తన రెండో హెచ్చరిక అని, ఆ తర్వాత తాను తప్పుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా చిదంబరం స్టేడియం పిచ్‌పై కూడా ఆయన స్పందించారు. ఐదారు సంవత్సరాల తర్వాత ఈ పిచ్‌పై తొలిసారి ఆడుతున్నట్టు చెప్పారు. పిచ్ చాలా నెమ్మదిగా ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, ధోనీ చెప్పినట్టుగానే బౌలర్లు గత మ్యాచ్‍‌లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాణించారు.