శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (12:51 IST)

బౌలింగ్‌తో ప్రయోజనం లేదు.. మారకపోతే.. కొత్త కెప్టెన్ కింద ఆడాల్సిందే: ధోనీ

Dhoni
Dhoni
ఈ బౌలింగ్‌తో ప్రయోజనం లేదు, ఇలాగే పోతే మనం వేరే కెప్టెన్సీ ఆడాల్సి వస్తుంది.. అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ధోనీ సూచన చేసినట్లు కామెంట్లు చేశాడు. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో 200కు పైగా పరుగులు చేసినప్పటికీ లక్నో చివరి వరకు ఆధిక్యంలో ఉంది. ఇది ఇలానే కొనసాగితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని వదులుకునే అవకాశం ఉందని మహేంద్ర సింగ్ ధోనీ సూచించాడు. 
 
బౌలర్ల పేలవ ప్రదర్శనతో ధోనీ నిరుత్సాహానికి గురయ్యాడు. ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే వేరే కెప్టెన్‌లో ఆడాల్సి వస్తుందని ధోనీ అన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం ధోనీ స్పందించాడు. 
 
200కు పైగా పరుగులు చేసినప్పటికీ లక్నో చివరి వరకు ఆధిక్యంలో ఉంది. ఎందుకంటే చెన్నై బౌలర్లు పొంతన లేకుండా పరుగులు ఇస్తున్నారు. అంతే కాకుండా వరుసగా వైడ్లు, నో బాల్స్. తొలి మ్యాచ్‌లోనూ చెన్నై బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. 
 
లక్నో సూపర్ జెయింట్‌పై చెన్నై బౌలర్లు మూడు నో బాల్‌లు, 13 వైడ్‌లు వేశారు. నో బాల్స్ లేకుండా తక్కువ వైడ్‌లు బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాలి. చాలా అదనపు డెలివరీలు వేయబడ్డాయి. వాటిని సరిదిద్దేందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది. ఇది వారికి రెండో హెచ్చరిక.. అని ధోని అన్నాడు.