ఇండస్ట్రీ లో నాపై రాళ్ళు వేస్తున్నారు మరి రాజకీయాల్లో వస్తే అంతే : దిల్‌రాజు
దిల్ రాజు అంటే దిల్ లేని రాజు, చెప్పేదొకటి చేసేదొకటి, ఓటీటీకి 8 వారాల గడువు తర్వాత ఇవ్వాలని రూల్ వున్నా అతిక్రమిస్తున్నాడు. రాజకీయాల్లో వస్తానంటాడు. కాసేపు రానంటాడు అంటూ రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి. వీటిపై దిల్‌రాజు మంగళవారంనాడు బలగం కాంట్రవర్సీ మీట్‌లో ఆయన మాట్లాడారు. నాకు దిల్ లేదు అనేది మీకే తెలియాలి. నాకు వస్తున్న పేరు తట్టుకోలేక ఇక్కడ రాళ్ళు వేస్తున్నారు. ఇలాంటి వారు ఎప్పుడు ఉంటారు. ఇక రాకకీయాలోకి వస్తే ఎన్నో తట్టుకోవాలి. ఆ ఆలోచన లేదు అని అన్నారు.
వేణు దర్శకత్వంలో బలగం సినిమాకు ఆయన సమర్పకుడిగా వున్నారు. ఈ సినిమా తెలంగాణ నేషథ్యంలో రూపొందింది. దిల్‌రాజు ఊరైన నిజామాబాద్‌లో ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఊరిలో పరదాలు కట్టి బలగం వేస్తున్నారు. ఇది అమెజాన్ ఓటీటీలో స్క్రీన్ అవుతుంది. అయినా ఊరిలో ఇలా సినిమా వేయడంపై కొందరు ఆయనపై కేసు వేశారు.
దీని గురించి దిల్‌రాజు వివరిస్తూ, నా లీగల్‌టీమ్ అంతా చూసుకుంటుంది. ఓటీటీ రూల్ ప్రకారమే మేం సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తున్నాం. అయితే గ్రామాల్లో పదాలువేసుకుని షోలు వేయడం మాకే అశ్చర్యంగా వుంది. కొందరు ఓటీటీలో చూడలేనివారు గ్రామాల్లో వున్నారు. వారు మమ్మల్ని సంప్రదిస్తే మేం సెపరేట్ స్క్రీనింగ్‌వేసి చూపిస్తామని అన్నారు.
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కుటుంబాల్లోని మనస్పర్థలు తెలుసుకుని కలిస్తే మా ద్వారా మార్పు వచ్నిదంటే ఆ ఆనందంగా వేరు. డబ్బు ప్రాధాన్యం కాదు. అయితే సినిమాను ఆపుతామని కొందరు అంటున్నారు. సినిమా తీసి ఓటిటికి ఇచ్చాం. వారి నుంచి ఒత్తిడి కూడా వచ్చింది. అందుకే లీగల్ టీమ్ వారితో చర్చించారు. మా బలగం సినిమాను ఆపం. ఎవరు ఎక్కడ ఎలా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా ఎవరూ చూడకపోతే మాకు ఫోన్ చేయండి. మేమే షో ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.
ఓటీటీ అగ్రిమెంట్‌లో వున్న రూల్ ప్రకారం మేం నడుచుకోవాలి. అమెజాన్ నా సినిమాలు అన్నీ తీసుకుంటున్నారు. నాకు వస్తున్న పేరు కొందరు ఇండస్ట్రీలో తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడూ ఆ బ్యాచ్ వుంటుంది. నేను నిజాయితీ వుంటాను. అందుకే బెస్ట్‌సినిమా ఇవ్వగలుగుతున్నా.
30 రోజులు అయినా ఇంకా కలెక్షన్లు వున్నాయి. అయితే ఓటీటీ ఇవ్వడం అనేది ముందుగా కలెక్షన్లు వస్తాయని తెలీదు. లాకపోతే మరో కోణంలో ఆలోచించేవాడిని.
త్వరలో శాకుంతలం పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీలో 8 వారాలు వుంటేనే వారు స్క్రీనింగ్ చేస్తారు. బాలీవుడ్‌లో రూల్ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. మన దగ్గర కొందరు నిర్మాతలు రూల్ మారుద్దామంటున్నారు అని తెలిపారు.