వామ్మో ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ ... నాలుగేళ్ళ చిన్నారికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్క్రబ్ టైఫస్ వైరస్ వణికిస్తోంది. తాజాగా నాలుగేళ్ల చిన్నారిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. విజయనగరం జిల్లా గజపతినగం ఏరియా ఆస్పత్రిలో ఆ చిన్నారిని అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
జిల్లాలోని బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగేళ్ళ చిన్నారికి మూడు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో ఏరియా ఆస్పత్రిలో స్క్రప్ టైఫస్ పరీక్ష చేశారు. ఈ నివేదికలో పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్, ఎలీసా టెస్టులో కూడా పాజిటివ్ వచ్చినట్టు గజపతినగరం ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి ప్రవీణ్ చెప్పారు. దీంతో మరువాడ గ్రామంలో అధికారులు క్లోరినేషన్‌ను చేపట్టారు. గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండాలని, జ్వరం మూడు రోజులకు కూడా తగ్గకుంటే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళి తనిఖీలు చేసుకోవాలని సూచించారు.