గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (16:16 IST)

కథ వెనుక కథ చాలా పెద్ద హిట్ అవుతుంది : నిర్మాత అవ‌నీంద్ర కుమార్‌

Avaniendra Kumar, Viswanth, ali, sunil
Avaniendra Kumar, Viswanth, ali, sunil
దండమూడి బాక్సాఫీస్ బ్యాన‌ర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి అవ‌నింద్ర కుమార్ నిర్మించారు  సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేస్తున్నారు. సోమ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. దేశంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న‌ నిర్భ‌య త‌ర‌హా ఘ‌ట‌న‌లను ఖండిస్తూ మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ వీడియోను విడుద‌ల చేశారు.  
 
హీరో విశ్వంత్ దుడ్డుంపూడి మాట్లాడుతూ ‘‘నటుడిగా కథ వెనుక కథ నా కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుంది. నేను ఎక్కువ‌గా మ‌ల‌యాళ సినిమాలు చూస్తూ పెరిగాను. దీంతో నాపై వాటి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. అందుక‌నే నేను చేసే సినిమాలు సూప‌ర్ హిట్స్ కాక‌పోయిన‌ప్ప‌టికీ బ్యాడ్ మూవీస్‌గా మాత్రం నిల‌వ‌కూడ‌ద‌ని అనుకున్నాను. అలాంటి ఆలోచ‌న‌తో ఉన్నప్పుడు ‘కథ వెనుక కథ’ సినిమా చేసే అవ‌కాశం క‌లిగింది. నా కెరీర్‌లో ఇదొక ఎక్స్‌పెరిమెంట్ మూవీ. ఇది హీరో డ్రైవింగ్ మూవీ కాదు..కంటెంట్ డ్రైవింగ్ మూవీ. ఈ సినిమాలో ప‌ని చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్‌. సునీల‌న్నతో ప‌ర్స‌న‌ల్‌గా కూడా మంచి రిలేష‌న్ ఏర్పడింది. అలీగారు మాకెంతో సపోర్ట్ చేశారు. వచ్చి యాక్ట్ చేసి వెళ్లిపోయామా అని కాకుండా ఓ రెస్పాన్సిబుల్‌గా మా సినిమాలో త‌న వంతు పాత్ర‌ను పోషించారు.  నాతో పాటు సినిమాలో న‌టించిన ఇత‌ర న‌టీన‌టుల‌తో పాటు టెక్నీషియ‌న్స్‌కి కూడా థాంక్స్. అవ‌నీంద్ర కుమార్‌గారు చాలా మంచి ప్రొడ్యూస‌ర్‌. ఆయ‌న‌తో ఇంకా ఎక్కువ‌గా సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాను. మార్చి 24 న మా ‘కథ వెనుక కథ’ మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు. 
 
నిర్మాత అవ‌నీంద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాయి వ‌చ్చి.. కృష్ణ చైత‌న్య గురించి చెప్పి క‌థ విన‌మ‌న్నారు. విన‌గానే.. వెంట‌నే నాకు సునీలే గుర్తుకు వ‌చ్చారు. ఎందుకంటే మంచి క‌థ దొరికితే సినిమా చేస్తాన‌ని అంత‌కు ముందు ఓసారి ఆయ‌న‌కు చెప్పాను. ‘కథ వెనుక కథ’ విన‌గానే సునీల్‌కు ఫోన్ చేస్తే ఆయ‌న రెడీ అన్నారు. అక్క‌డ నుంచి సాయి ముందుండి సినిమాను న‌డిపించాడు. హెచ్‌బీఓ చానెల్ చూసి అదే స్ఫూర్తితో డీబీఓ (దండ‌మూడి బాక్సాఫీస్‌) పెట్టాను. ఇది చాలా పెద్ద ఇండ‌స్ట్రీ. చాలా కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఇందులో వ్యాపారం చేయ‌టం అంత సుల‌భం కాదు. ఇక్క‌డకు రావాలంటే ప్యాష‌న్ ఉండాలి. లాభ‌న‌ష్టాలు గురించి ఆలోచించ‌కుండా ఉంటేనే మంచి సినిమాలు చేయ‌గ‌లుగుతాం. ఎవ‌రైనా ఈ రంగంలోకి రావాల‌నుకుంటే ప్యాష‌న్ ఉండాలి. సినిమా చాలా మంచి స‌క్సెస్ కావాలి. భవిష్యత్తులోనూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాలు చేస్తాం’’ అన్నారు. 
 
చిత్ర ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ ‘‘‘కథ వెనుక కథ’ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాత అవ‌నీంద్ర కుమార్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. హీరో విశ్వంత్‌కి థాంక్స్‌. ఈ సినిమా అవ‌కాశం రావ‌టానికి ప్ర‌ధాన కార‌ణం నా స్నేహితుడు సాయి. ఇది చాలా బ‌ల‌మైన క‌థ‌. స‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కి థాంక్స్‌. అలాగే మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్ర‌వ‌ణ భ‌ర‌ద్వాజ్‌కి థాంక్స్‌. నాకు స‌పోర్ట్ చేసిన మా డైరెక్ష‌న్ టీమ్‌కి కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు. 
 
న‌టుడు అలీ మాట్లాడుతూ ‘‘నిర్మాత అవ‌నీంద్ర కుమార్‌గారు చాలా మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. ఆయ‌న‌కు సినిమాలు తీసి లాభాల‌ను సంపాదించాల‌నే ఉద్దేశం లేదు. ఓ కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తే.. త‌ను భ‌విష్య‌త్తులో పెద్ద ద‌ర్శ‌కుడు అయితే ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డ‌తాడనేదే ఆయ‌న ఆలోచ‌న‌. సినిమాలో లాభాలు వ‌చ్చినా ఆయ‌న త‌న ద‌గ్గ‌ర ఉంచుకోడు. అంద‌రికీ పంచేస్తాడు. అలాగే గొట్టిపాటి సాయి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 30 ఏళ్లు అయ్యింది. ఈ సినిమాకు స‌హ నిర్మాత‌గా ప‌ని చేశాడు. ఇలాంటి నిర్మాత ఉంటే, ఆయ‌న చేసే మూవీస్‌ హిట్ అయితే అంద‌రూ బావుంటారు. నిర్మాత‌లు బావుంటేనే ఇండ‌స్ట్రీ బావుంటుంది. ఇలాంటి టీమ్‌కు ప్రేక్ష‌కుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యం. మార్చి 24న రిలీజ్ అవుతున్న ‘కథ వెనుక కథ’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 
 
న‌టుడు సునీల్ మాట్లాడుతూ ‘‘‘కథ వెనుక కథ’ చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి చేసే సినిమాలో అంద‌రికీ ముందుగా, అండ‌గా నిల‌బ‌డేది నిర్మాత‌గారే. అలా అండ‌గా నిల‌బ‌డిన వ్య‌క్తి అవ‌నీంద్ర కుమార్‌గారు. ఇలాంటి నిర్మాత దొర‌క‌టం చాలా అదృష్టం. కృష్ణ చైత‌న్య‌కు అవ‌నీంద్ర కుమార్‌గారి వంటి నిర్మాత దొరికారు. కృష్ణ చైత‌న్య చాలా మంచి క‌థ‌తో ఈ సినిమాను చేశాడు. మంచి నిర్మాత‌ను ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చిన సాయిగారికి థాంక్స్‌. విశ్వంత్ చాలా మంచి న‌టుడు, బాయ్ నెక్ట్స్ డోర్‌లా అనిపిస్తాడు. ఫ్యూచ‌ర్‌లో మంచి హీరో అవుతాడు. త‌న‌కు, హీరోయిన్స్ స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు. మార్చి 24న మూవీ రిలీజ్ అవుతుంది. ఇలాంటి క్యారెక్ట‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు. చాలా మంచి పాత్ర‌లో న‌టించాను. ఇంత మంచి రోల్ ఇచ్చిన కృష్ణ చైత‌న్య‌గారికి థాంక్స్‌. శ్ర‌వ‌ణ్‌ భ‌ర‌ద్వాజ్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. త‌న‌కు అభినంద‌న‌లు. అలీగారు ఓ సాంగ్‌లో నటించారు. మార్చి 24న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాను చూసి పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ ‘‘నేను లవ్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తానని అందరూ అనుకుంటారు. కానీ నేను ఇలాంటి డిఫ‌రెంట్ సినిమాల‌కు కూడా మ్యూజిక్ ఇస్తాన‌ని తెలుసు. అలాంటి వారిలో డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య ఒక‌రు. నిర్మాత అవ‌నీంద్ర‌గారు, సాయిగారు నాకెంతో ఫ్రీడ‌మ్ ఇచ్చి వ‌ర్క్ చేయించుకున్నారు. రెండు పాట‌ల‌కు సంగీతం అందించారు. పూర్ణాచారి మంచి సాహిత్యాన్ని అందించారు. అంద‌రికీ న‌చ్చుతుంది. మార్చి 24న సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ కృష్ణ చైత‌న్య‌కు థాంక్స్‌. ఓ సాంగ్ చేసే అవ‌కాశం ఇచ్చారు. నిర్మాత అవ‌నీంద్ర కుమార్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఆయ‌న వ్యాపార‌వేత్త, నిర్మాతే కాదు.. మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. ప్రివ్యూ షో చూశాను. విశ్వంత్ స‌హా అంద‌ర‌రూ అద్భుతంగా చేశారు. అన్ని చ‌క్క‌గా కుదిరాయి. సునీల్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని పాత్ర‌లో న‌టించారు. సాయిగారు స‌హా అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 
 
నటుడు మధునందన్ మాట్లాడుతూ ‘‘నిర్మాత అవనీంద్ర కుమార్‌గారు పెద్ద స్కేల్ సినిమాను చేయ‌ట‌మే కాదు.. ప్ర‌మోష‌న్స్ కూడా అదే రేంజ్‌లో చేస్తున్నారు. ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌. ఆయ‌న నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. మార్చి 24న రిలీజ్ అవుతున్న ‘కథ వెనుక కథ’ సినిమా కొత్త‌గా ఉంటుంది. ఎంట‌ర్టైన్ అవుతారు’’ అన్నారు. 
 
హీరోయిన్ శ్రీజిత గౌస్ మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ‘కథ వెనుక కథ’ డిఫ‌రెంట్ క‌థ‌. విశ్వంత్ అమేజింగ్ కో యాక్ట‌ర్‌. అంద‌రూ నాకు బాగా స‌పోర్ట్ చేశారు. శ్ర‌వ‌ణ్‌గారు మంచి సంగీతాన్ని అందించారు. నిర్మాత అవ‌నీంద్ర‌కుమార్‌గారికి, ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్యకు థాంక్స్‌’’ అన్నారు. 
 
హీరోయిన్ శుభశ్రీ మాట్లాడుతూ ‘‘మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన కృష్ణ‌చైత‌న్య‌గారు, సాయిగారికి, నిర్మాత అవ‌నీంద్ర కుమార్‌గారికి థాంక్స్‌. విశ్వంత్, శ్రీజిత‌, సునీల్‌గారు, అలీగారు స‌హా అంద‌రికీ థాంక్స్’’ అన్నారు.