సస్పెన్స్ థ్రిల్లర్ గా కథ వెనుక కథ
katha venuk katha
డైరెక్టర్ కావాలనుకునే ఓ యువకుడు (విశ్వనాథ్) ఓ కథను సిద్ధం చేసుకుంటాడు. సిటీలో అమ్మాయిలు కనిపించకపోవటంపై ఓ కథను తను రెడీ చేసుకుంటాడు. అయితే నిజంగానే సిటీలో అమ్మాయిలు కనిపించకుండా పోవటమే కాదు.. హత్యకు కూడా గురవుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయటానికి ఓ పోలీస్ ఆఫీసర్ (సునీల్) వస్తాడు. తను అనుమానాస్పదంగా ఉంటూ డైరెక్టర్ కావాలనుకునే యువకుడిని అరెస్ట్ చేస్తాడు. అసలు అమ్మాయిలు సిటీలో కనిపించకుండా పోవటానికి కారణం ఎవరు? ఆ క్రైమ్ వెనుకున్న గ్యాంగ్ ఏది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నిర్మాత దందమూడి అవనీంద్ర కుమార్ కథ వెనుక కథ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. సినిమాలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.
